Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ సీక్రెట్ చెప్పిన‌ మంజుల‌

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (11:29 IST)
Manjula
మ‌నం ఎలా వుండాలి? ఎందుకు అలా వుండాలి? అనే విష‌యాలు చిన్న‌త‌నంలో అమ్మ‌మ్మ‌లు, నాన్న‌మ్మ‌లు చెబుతుండేవారు. కానీ వాటిని అస్స‌లు ప‌ట్టించుకోం. ఏదో సోది అంటూ వారు చెప్పింది విన‌కుండా నిద్ర‌పోతుంటాం. అది వ‌య‌స్సు పెరిగాక కానీ మ‌న‌కు అర్థంకాదు. అలాంటి వారిలో నేనూ ఒక దానినే అంటూంది మ‌హేస్‌బాబు సోద‌రి మంజుల ఘ‌ట్ట‌మ‌నేని. మ‌న అమ్మ‌మ్మ‌లు ఉద‌య‌మే త్వ‌ర‌గా  లేవండి. రాత్రి త‌ర్వ‌గా నిద్ర‌పోండి అంటుండేవారు. పాత చింత‌కాయ ప‌చ్చ‌డి అని తీసిపారేస్తుంటాం. కానీ ఆ మాట‌ల‌కు ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ లాజిక్‌లు వెతికి ఏదో క‌నిపెట్టి చీద‌రించుకుంటారు.
 
పెద్ద‌ల మాట‌ల‌కు సైన్స్‌కు చాలా సంబంధం వుంది అంటున్నారు మంజుల‌. త‌న చిన్న‌నాటి విష‌యాల‌ను ఓసారి మ‌న‌నం చేసుకున్నారు. నేనూ చాలామందిలాగే బ‌ద్ద‌కం, మూడీగా వుండ‌డం, చీకాకు ప‌డ‌డం వుండేది. కాలేజీ పూర్త‌య్యాక ఏదో స్వాతంత్రం వ‌చ్చిన‌ట్లు ఫీల‌య్యేదానిని. ప‌గ‌లు ఎక్కువ‌గా నిద్ర‌పోయేదానిని. సోద‌రి ప్రియ‌కు మ‌హేష్‌బాబుకూ నేనే చ‌దువులో హెల్ప్ చేసేదానిని కూడా. ఓసారి మంచి నిద్ర‌లో వుండ‌గానే ప్రియ వ‌చ్చి నిద్ర లేపింది. అంతే ఎక్క‌డ‌లేని కోపం వ‌చ్చేది చికాకుతో పెద్ద‌గా అరుస్తూ తిట్టేశాను. వెంట‌నే అన్న‌య్య వ‌చ్చి మంజుల‌ను నిద్ర‌పోయేట‌ప్పుడు లేప‌కూడ‌దు గ‌దా.. నేను నీకు హెల్ప్ చేస్తాన‌ని ప‌క్క‌కు తీసుకెళ్ళాడు. ఆ త‌ర్వాత ప్రియ క‌ళ్ళ‌లో నీళ్ళు రావ‌డం చూసి చాలా బాధేసింది. సిస్ట‌ర్ క‌దా. ఎందుకు నాకు అంత కోపం వ‌చ్చింది. అర్థం కాలేదు. ఆ త‌ర్వాత ఆలోచిస్తే నేను లేటుగా నిద్ర‌లేవ‌డం వ‌ల్ల ఇదంతా జ‌రిగింద‌ని అనిపించింది.
 
అందుకే బామ్మ‌ల‌మాట బంగారుమూట అన్నారు. అప్ప‌టినుంచి నేను పూర్తిగా మారిపోయాను. అమ్మ‌మ్మ ప్ర‌తిరోజూ పొద్దున్నే లేవాలి. సూర్యుడిని చూడాలంటే ఏదో అనుకున్నా. ఇప్పుడు తెలిసింది. మ‌న‌లోని చైత‌న్యం క‌లిగించేది సూర్యుడే. ప్ర‌కృతిలో ప్ర‌తీదీ సూర్యుని నుంచి శ‌క్తిని తీసుకుంటాయి. మ‌నం కూడా తీసుకోవాలంటే ఉద‌యమే సూర్యునిలేత కిర‌ణాలు బాడీకి తాకాలి. అందుకే 25 నిముషాలు కాసేపు బ‌య‌ట న‌డ‌వాలి. లేదా యోగా చేయాలి. అంటూ వివ‌రించింది. దీనికి సైన్స్‌కూ చాలా లాజిక్ వుంది. మ‌న‌లోని మెలాటిమ్ లెవ‌ల్స్ సూర్య కిర‌ణాల‌వ‌ల్ల పెరుగుతాయి. 
 
స‌న్‌రైజ్ వ‌ల్ల పాజిటివ్‌గా మారిపోతాం. దీనివ‌ల్ల బ‌ద్ద‌కం, డ‌యాటిస్ వ‌గైరా వంటి వ‌న్నీ కంట్రోల్ అవుతాయి. అందుకే మ‌న బామ్మ‌లు ఆరోగ్యంగా ఎక్కువ కాలం వున్నారంటే అదే ర‌హ‌స్యం. దీన్ని నా పిల్ల‌ల‌కూ ఫాలో చేస్తున్నా. మీరూ చేయండి.. అంటూ సైన్‌టిస్ట్‌గా విష‌యాలు చెబుతోంది. ఎంత లేట్ అయినా మ‌హేష్‌కూడా పొద్దునే నిద్ర‌లేస్తాడట‌. అందుకే మీరూ ఆ ప‌నిలో వుండండి. ఆరోగ్యం కాపాడుకోండ‌ని అంద‌రికీ చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments