నాగచైతన్యతో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో నటించిన మంజిమా మోహన్.. తాను రెండు భాషల్లో నటించే ఛాన్స్ రావడం చాలా ఆనందంగా వుందని పేర్కొంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ ఈచిత్రం తెలుగు, తమిళంలో రూపొందింది. తమిళంలో శింబుతో నటించింది.

ఆమె మాట్లాడుతూ .. తన అభిమాన దర్శకుడు గౌతమ్ మీనన్ అనీ, ఆయన దర్శకత్వంలో తమిళంలో తొలి సినిమా చేయడం ఆనందంగా ఉందని చెప్పింది. ఆయనతో తొలి సినిమా చేయడం ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అంది. తెలుగులో చిరంజీవి .. నాగార్జునతో కలిసి నటించాలని ఉందని చెప్పింది.