Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణికర్ణిక నుంచి నిర్మాత వాకౌట్.. కంగనా రనౌత్‌కు ఆ అర్హత లేదట..

మణికర్ణిక ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం ఒక్కొక్కరు తప్పుకుంటూ వస్తున్నారు. దర్శకుడు క్రిష్ పూర్తి చేసిన ఈ ప్రాజెక్ట్‌లో చిన్న చిన్న పనులు మిగిలిపోవడం, దర్శకుడు క్రిష్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (10:32 IST)
మణికర్ణిక ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం ఒక్కొక్కరు తప్పుకుంటూ వస్తున్నారు. దర్శకుడు క్రిష్ పూర్తి చేసిన ఈ ప్రాజెక్ట్‌లో చిన్న చిన్న పనులు మిగిలిపోవడం, దర్శకుడు క్రిష్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను హీరోయిన్ కంగనా రనౌత్ చేతుల్లోకి తీసుకుంది.
 
ఈ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకున్నాక.. ఒక్కొక్కరినీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పించుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన పాత్రను పోషిస్తున్న సోనుసూద్ సినిమా నుంచి తప్పుకున్నాడు. సోనూసూద్ పక్కకు తప్పుకోవడంతో ప్రాజెక్ట్ అయోమయంలో పడిపోయింది. కంగనా మాత్రం ఎవరు ఉన్నా లేకున్నా ప్రాజెక్ట్ ఆగదని.. అనుకున్న సమయానికి సిద్ధం అవుతుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది.
 
దాదాపు సినిమా షూటింగ్ పూర్తయింది. మిగిలిన ప్యాచ్ వర్క్ కంగనా నేతృత్వంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోనూ సూద్‌కి కంగనా రనౌత్ దర్శకత్వ పగ్గాలు చేపట్టడం నచ్చక ఆయన ప్రాజెక్ట్ నుండి వాకౌట్ చేశాడు. దర్శకురాలిగా కంగనాకి ఏం అర్హత ఉందని ఆయన మీడియా ముఖంగా అన్నారు.
 
తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి నిర్మాత సంజయ్ కుట్టి కూడా తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు కొత్త నిర్మాతలు ఈ సినిమాను టేకప్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రూ.70 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్త ఇప్పుడు రూ.100 కోట్లకు చేరుకోవడం, విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు ఉండడంతో నిర్మాత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని టాక్.

సంబంధిత వార్తలు

లోక్‌సభ ఎన్నికల్లో "చిరుత" హీరోయిన్ పోటీ!

27 నుంచి ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం!!

వైకాపా నుంచి మరో వికెట్ డౌన్... కాషాయం కండువా కప్పుకున్న గూడూరు ఎమ్మెల్యే!!

మందు బాబులకు చేదువారం.. 25న మందు షాపులు బంద్.. ఎక్కడ?

నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకో తెలుసా?

డయాబెటిక్ కిడ్నీ వ్యాధి నిరోధించేందుకు సింపుల్ టిప్స్

మానసిక ఒత్తిడిని తగ్గించే 6 ఆహార పదార్థాలు, ఏంటవి?

స్వర్ణభస్మ తింటే కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినకూడని 7 రకాల పండ్లు, ఏంటవి?

అన్యదేశ పండ్లు- కూరగాయలు మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి: హేమల్

తర్వాతి కథనం
Show comments