పూరి జగన్నాధ్, మెలోడీ బ్రహ్మ మణిశర్మలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలు చార్ట్ బస్టర్ ఆడియో, బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి. ఉస్తాద్ రామ్ పోతినేనితో దర్శకుడు పూరీ జగన్నాధ్ చేస్తున్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' కోసం ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యింది. సీక్వెల్ ఖచ్చితంగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో ఇంపార్ట్టెంట్,లెన్తీ రోల్ ని పోషిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రామ్, సంజయ్ దత్ పేస్ ఆఫ్ చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
పూరి జగన్నాధ్ బిగ్ స్పాన్ వున్న కథను రాశారు. పూర్తిగా స్టైలిష్ అవతార్ లో ప్రధాన నటీనటులను ప్రజెంట్ చేస్తున్నారు. సినిమాలో రామ్ స్టైలిష్ బెస్ట్ లుక్ లో కనిపించనున్నారు
సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో డబుల్ ఇస్మార్ట్ రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్.
డబుల్ ఇస్మార్ట్ మార్చి 8, 2024న మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో విడుదల కానుంది.