Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నియన్ సెల్వన్ భారీ వసూళ్లు.. ఒక్క రోజుకే రూ.80కోట్ల కలెక్షన్లు

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (17:47 IST)
PS-1
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్.. విడుదలైన ఒక్క రోజుకే కలెక్షన్లు రాబట్టింది. మణిరత్నం హిస్టారికల్ మూవీ అయిన ఈ పీఎస్-1 తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 80కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. 
 
PS-1 విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద భారీ అడ్వాన్స్ బుకింగ్ అమ్మకాలను నమోదు చేసుకుంది. దీంతో విడుదలైన తొలిరోజే ఈ మల్టీస్టారర్ బాక్సాఫీస్‌‌ను షేక్ చేసింది. అంతేగాకుండా తమిళ సినిమాకి బిగ్గెస్ట్ ఎవర్ ఓపెనింగ్ డేగా నిలిచింది.
 
చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్యరాయ్ బచ్చన్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రంపై ద‌క్షిణాదిలో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. 
 
ఈ చిత్రం తొలి రోజు మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. హిందీలో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్‌ల చిత్రం 'విక్రమ్ వేద' నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ 'పీఎస్‌1'కి భార‌త్‌తో పాటు విదేశాల్లో అద్భుత ఓపెనింగ్స్ వ‌చ్చాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 
 
ముఖ్యంగా త‌మిళ‌నాడులో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ల‌భిస్తోంది. తొలి రోజు అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన తమిళ చిత్రంగా నిలిచింది. అమెరికాలో 'పీఎస్‌1' దూసుకెళ్తోంద‌ని టాక్ వస్తోంది. 
 
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇంకా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ అరెస్టవుతారా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రిపేర్ చేసినందుకు రూ.90వేలు బిల్లు.. అంతే విరగ్గొట్టేశాడు..! (video)

శ్రీరాముని వేలు విరిగింది.. బంగారుపూతతో మరమ్మత్తులు చేశాం.. టీటీడీ

సింగపూర్‌తో వైకాపా తెగతెంపులు.. ఏం జరిగిందో కనుక్కోండి.. బాబు

నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌.. కేటీఆర్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments