లడ్డూ వివాదం- ప్రకాష్ రాజ్ Vs మంచు విష్ణు.. లిమిట్స్‌లో వుండండి..

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (15:45 IST)
సినీనటుడు ప్రకాశ్ రాజ్ లడ్డూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగిందని, దయచేసి దీనిపై విచారణ జరపాలని అన్నారు. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. 
 
అంతేగానీ, దీనిపై ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని, ఈ సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారని అన్నారు. ఇప్పటికే దేశంలో ఎన్నో మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని తెలిపారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ఎక్స్‌లో ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ట్వీట్‌కు "మా"అధ్యక్షులు మంచు విష్ణు స్పందించారు. ప్రకాశ్ రాజ్ దయచేసి నిరుత్సాహం, అసహనం ప్రదర్శించవద్దని హితవు పలికారు. పవిత్రమైన దేవాలయంలో లడ్డూ వివాదంకు సంబంధించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే కోరారు. 
 
ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ పరిధుల్లో మీరు ఉండండి అని మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌కు ట్విట్టర్ వేదికగా సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments