Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్సనల్ విజిట్.. అన్నావదితో లంచ్ చేయడానికి వచ్చా : మంచు విష్ణు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (18:23 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు మంగళవారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సీఎం జగన్‌తో భేటీ కేవలం వ్యక్తిగతమేనని చెప్పారు. అన్నావదినతో కలిసి లంచ్ చేయడానికి వచ్చానని ఈ సమావేశం తర్వాత మీడియాతో చెప్పారు. 
 
అదేసమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా, విష్ణు తన తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు ముఖ్యమంత్రిని కలవాలని భావించారన్నారు. ఆయనకు కూడా సీఎం నుంచి ఆహ్వానం అందిందని, కానీ, దాన్ని మా డాడీకి చేరకుండా కొందరు అడ్డుకున్నారని చెప్పారు. వారు ఎవరో సమయం వచ్చినపుడు వెల్లడిస్తానని చెప్పారు.
 
ఇకపోతే, 'కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, సినిమా పరిశ్రమ ఒక పెద్ద కుటుంబం. అంతర్గతంగా సమస్యలను పరిష్కరించుకుంటాం' అని ఆయన పేర్కొన్నారు.
 
సినీ పరిశ్రమ విశాఖపట్నం తరలింపుపై మా ప్రెసిడెంట్ స్పందిస్తూ.. ‘సినిమా వాళ్లకు ఏపీ, తెలంగాణలు రెండు కళ్లు లాంటివి’ అంటూ ‘తెలుగువాళ్లంతా మాకు కావాలి’ అని వ్యాఖ్యానించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments