Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహ‌న్‌బాబుగారిని జ‌గ‌న్‌తో భేటీకి త‌ప్పించిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా!

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (18:05 IST)
Vishnu family with Jagan
మంచు విష్ణు ఈరోజు వై.ఎస్‌. జగ‌న్‌తో భేటీ అయ్యారు. వ‌రుస‌కు బావ‌గారు అవుతారు. కానీ తాను అన్న అని పిలుస్తాన‌ని విష్ణు పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌లో మీడియా స‌మావేశంలో మంచు విష్ణు ఆస‌క్తిక‌రమైన విష‌యాలు వెల్ల‌డించారు. మొన్న సినీ పెద్ద‌లు జ‌గ‌న్‌గారితో భేటీ అయ్యారు. ఆహ్వానం మా నాన్న‌గారికి కూడా వ‌చ్చింది. పేర్ని నానిగారే చెప్పారు. కానీ ఎందుక‌నో కావాల‌ని నాన్న‌గారిని త‌ప్పించారు. అది ఎవ‌రో తెలుసు. త్వ‌ర‌లో ఆ విష‌యం మీకు చెబుతానంటూ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కుల స‌మాధానం చెప్పారు.
 
ఇక వైజాగ్‌లో షూటింగ్‌ల‌కు స్టూడియోల‌కు స్థ‌లాలు ఇస్తామ‌ని జ‌గ‌న్‌గారు చెప్పారు. సినిమా స‌మ‌స్య‌ల గురించి చెప్పారు. అవ‌న్నీ మా అధ్య‌క్షుడిగా నేను ఫిలింఛాంబ‌ర్‌లో కార్యాల‌యం వుంది. దానికింద అనుబ‌వంధ సంఘాలున్నాయి. నేను హైద‌రాబాద్ వెళ్ళాక పెద్ద‌ల‌తో కూర్చుని చ‌ర్చిస్తాన‌ని క్లారిటీ ఇచ్చాడు.
 
ఏదైనా మా సినిమా అనేది కుటుంబం. కొన్ని స‌మ‌స్య‌లుంటాయి. అవ‌న్నీ ప‌రిష్క‌రించుకుంటామ‌ని కూడా తెలిపారు. అలాగే పేర్నినాని ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు కొంద‌రు మీడియా వారు త‌ప్పుగా రాసేశారు. నాకు అన్ని పార్టీల‌వారితో ఫ్రెండ్స్ వున్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌గారి ఇంటిలో పెండ్లికి నాన్న‌గారు వ‌చ్చారు. అప్పుడు పేర్ని నాని తెలుసుకుని మా ఇంటికి ర‌మ్మన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ కొంద‌రు మీడియా థ్యాంక్స్ అనే ప‌దాన్ని ట్వీట్‌లో పెడితే ర‌క‌ర‌కాలుగా మార్చేసి, రాద్దాంతం చేశారు. నేను జ‌గ‌న్‌గారితో చ‌ర్చించిన విష‌యాలు నా వ్యక్తిగ‌తం అయిన‌వే. 
తిరుప‌తిలో స్టూడియో క‌డ‌తా
ఫైన‌ల్‌గా సినిమా అనేది ఒకే కుటుంబం. మా అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌గారిని మూడో సారి క‌లిశాను. ఇవాళే కాదు అని తేల్చిచెప్పారు. తిరుప‌తిలో స్టూడియోలు క‌డ‌తాను. ఫిలింకోర్సులు మొద‌లుపెడ‌తాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments