Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం మా బావ వైఎస్ఆర్ : మోహన్ బాబు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (15:43 IST)
ప్రజానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని పలువురు సెలెబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పించారు. అలాంటి వారిలో సినీ హీరో డాక్టర్ మోహన్ బాబు కూడా ఒకరు. ఆయన తన మనసులోని మాటను ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
వైఎస్సార్ స్నేహశీలి అంటూ కొనియాడారు. 'మాట తప్పలేరు మానధనులు' అన్న పోతన మాటకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనం అంటూ అభివర్ణించారు.
 
"పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా" అంటూ మోహన్ బాబు స్పందించారు. 
 
అలాగే, ప్రముఖ సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తన నివాళులు ట్విట్టర్ ద్వారా అర్పించారు. "విలక్షణ రాజకీయచతురుడు, అవసరంలో వున్నవాళ్లకు అభయదాత, రైతన్నలకు ఆపద్భాంధవుడు పౌరుషానికి ప్రతినిధి , నిరుపేదల పాలిట ప్రత్యక్షదైవం, రాజకీయం అంటే వాగ్దానం చెయ్యడం కాదు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం అని భావితరాలకు నేర్పిన ప్రజల ముఖ్యమంత్రి డా రాజశేఖరరెడ్డిగారి జయంతి నేడు. వందనాలు మహానుభావా" అంటూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments