Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూటలు మోసే కూలీగా మారిన హీరో మంచు మనోజ్.. ఎవరికోసం?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోర్టర్‌గా మారాడు. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో చెమటలు కారేలా మూటలు మోస్తూ కనిపించాడు. ఈయన మూటలు మోయడమేంటని అక్కడున్న

Webdunia
సోమవారం, 11 జులై 2016 (15:33 IST)
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోర్టర్‌గా మారాడు. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో చెమటలు కారేలా మూటలు మోస్తూ కనిపించాడు. ఈయన మూటలు మోయడమేంటని అక్కడున్నవారు బిత్తరపోయారు. కొందమంది ఇదేదో షూటింగ్ అనుకుని ఊరుకున్నారు. ఆ తర్వాత అది షూటింగ్ కాదని తెలిసి ఆశ్చర్యపోయారు. అసలు విషయానికి వస్తే తన సోదరి మంచు లక్ష్మి ''మేము సైతం'' పేరుతో ఓ సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 
 
పలువురు సెలెబ్రిటీల చేత వివిధ పనులు చేయిస్తూ నిధులు సేకరిస్తున్నారు. వచ్చి సొమ్మును కష్టాల్లో ఉన్న పేదలకు అందిస్తూ చేయూతనిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం కోసం మనోజ్ కూలీగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మంచు మనోజ్ మూటలు మోశాడు. ఈ సందర్భంగా సంపాదించిన డబ్బులను మేము సైతం కార్యక్రమానికి విరాళంగా ఇచ్చాడు. 
 
మరోవైపు మంచు మనోజ్ను మూటలు మోయడం చూడ్డానికి పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు. అతడితో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఈ విషయంపై మనోజ్ మాట్లాడుతూ.. ఓ పేద కుటుంబానికి సాయం అందించేందుకు మూటలు మోయడం చెప్పలేనంత ఆనందంగా ఉందని అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments