Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (13:23 IST)
హీరో మంచు మనోజ్ శుక్రవారం చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. తాను నటించిన చిత్రం "భైరవం" శుక్రవారం విడుదలైంది. దీన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా ఈ ఆసక్తికర ట్వీట్‌తో పాటు ఓ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన తండ్రి, హీరో మోహన్ బాబు నటించిన 'పెదరాయుడు' చిత్రంలో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటోను ఎడిట్ చేసి పంచుకున్నాడు. దీనికి ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అనే క్యాప్షన్ ఇచ్చారు. 
 
కాగా, తండ్రి మోహన్ బాబుతో వివాదాలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ పోస్టు చేయడం గమనార్హం. తన తండ్రి పాదాలను తాకాలని ఉందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ భావోద్వేగానికి గురైన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన "భైరవం" శుక్రవారం విడుదలైంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటివరకు ప్రమోషన్స్ కూడా బాగానే చేశారనే టాక్ వస్తోంది. మనోజ్ సినిమాలకు దాదాపు తొమ్మిదేళ్లు దూరమైన తర్వాత చేసిన మూవీ ఇది. దీంతో ఆయన అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments