Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

డీవీ
శుక్రవారం, 30 మే 2025 (12:53 IST)
Bhairavam
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న నేడు విడుదలైంది
 
కథ:
గోదావరి జిల్లాలోని ఓ ఊరిలో వారాహి అమ్మవారి‌కి చెందిన భూమిని బ్యాంకులో భద్రపరచి విదేశాలకు వెళ్లిపోతాడు విజయ్ వర్మ. వారి వారసుడు మనోజ్, జయసుధ కుటుంబం. అదే ఊరిలో నారారోహిత్ ఫ్యామిలీ ఉంటుంది. బెల్లంకొండ శ్రీను అనాధ. చిన్నతనంలో ఈ ముగ్గురు ఫ్రెండ్స్‌గా ఉంటారు. 
 
కాగా, ఆ ఊరి దేవాలయం భూమి విలువ వెయ్యి కోట్లు ఉంటుంది. దానిపై దేవాదాయ మంత్రి కన్ను పడుతుంది. డాక్యుమెంట్స్ బ్యాంకు లాకర్‌లో ఉంటాయి. ట్రస్టీగా జయసుధ ఉంటుంది. ఆమె సడన్‌గా చనిపోతుంది. అప్పుడు ట్రస్ట్‌కి ఎన్నికలు జరుగుతాయి. అందరూ శ్రీను నీ ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఊరిలో జరిగే జాతరలో అమ్మవారి నగలుతో పాటు డాక్యుమెంట్స్ శ్రీను తెస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది.. శ్రీను డాక్యుమెంట్స్ ఎందుకు తెచ్చాడు. చివరికి ఏమి జరిగింది. అనేది సినిమా..
 
సమీక్ష:
తమిళ మాతృక గరుడన్‌కు రీమేక్. అయితే సెకండ్ ఆఫ్‌లో కొంత మార్చారు. కథ ప్రకారం ముగ్గురు నటులు బాగా సరిపోయారు. పోటాపోటీగా నటించారు. అందులో మనోజ్‌కు విలన్‌గా బాగా నప్పాడు. అతిధి అల్లరి అమ్మాయిగా నటించింది. అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు పాత్రమేరకు నటించారు.
 
సాంకేతికంగా కెమరా పనితనం కుదిరింది. మ్యూజిక్ పరంగా నేపథ్య సంగీతం హైలెట్. సంభాషణలు సన్నివేశపరంగా రాసారు. దర్శకుడు విజయ్ కనకమేడల కథనం ఆకట్టుకుంది. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అమ్మవారు శ్రీనులో పునడం థ్రిల్‌గా ఉంది. అప్పుడు ఆవేశం, రౌద్రం హావభావాలు పలికించాడు. 
 
ఈ కథకు భారతం లోని కురుక్షేత్రం వంటి మాటలు సన్నివేశపరంగా కేర్ బాగా తీసుకున్నాడు. నిజాలు చెప్పే విధానం శ్రీను సంభాషణల్లో వెరైటీ కనిపించింది.
 
కథ ప్రకారం పాతదే అయినా ట్రీట్ మెంట్ కొత్తగా ఉంది. స్నేహం మధ్య పొరపొచ్చాలు రావడానికి కారణం భార్య, బావమరిది.. అనేది చక్కగా చూపాడు. ఇలాంటి సినిమాలు మాస్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
రేటింగ్: 2.75/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments