Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛి..ఛి.. మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి? మంచు హీరో ప్రశ్న

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (20:42 IST)
మంచు వారి తనయుడు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది చేసిన దాడిపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను షేర్ చేసాడు. సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్న ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
 
బర్కత్‌పురలో కాలేజీకి వెళ్తున్న మధులికపై భరత్ అనే యువకుడు కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా నరికి గాయపరిచాడు. ఆ ఘటనలో మధులికకు 14 చోట్ల గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి ఇంకా విషమంగా ఉండటంతో ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నారు వైద్యులు. 
 
దీనిపై స్పందిస్తూ "మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి? మనిషి అనేవాడు ఒక ఆడపిల్ల మీద దాడి చేసే ముందు వాళ్ల ఇంట్లో ఉన్న ఆడవాళ్లను తలచుకుంటే ఇలాంటివి ఏనాడూ జరగవు... ఆడపిల్లల్ని రక్షించాల్సిన మగాడు ఆడపిల్లను అనుభవించే నరకానికి కారకుడు ఐతే ఇంక మనం పుట్టిన దానికి అర్థం దేనికి??" అంటూ విచారం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments