Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (16:41 IST)
తనను పోలీసులు అరెస్టు చేయలేదని హీరో మంచు మనోజ్ అన్నారు. తిరుపతిలో అర్థరాత్రి మంచు మనోజ్‌ను పోలీసులు అరెస్టు చేశారని, రాత్రంతా పోలీస్ స్టేషనులోనే ఉంచింనట్టు వచ్చిన వార్తలపై హీరో స్పందించారు. ఈ వార్తలను మంచు మనోజ్ ఖండిస్తూనే తనను పోలీసులు అరెస్టు చేయలేదని చెప్పారు. తనకు తానుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్టు చెప్పారు. 
 
డాక్టర్ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల తరపున పోరాటం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్న మనోజ్ తిరుపతి దగ్గరలోనే నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి ఓ రిసార్టులో తన అనుచరులతో కలిసి బస చేయగా రౌండ్స్‌లో భాగంగా భాకరాపేట పోలీసులు రిసార్టు వద్ద కనిపించిన వ్యక్తులను ప్రశ్నించారు. తాము మంచు మనోజ్ మనుషులమని వాళ్ళు చెప్పడంతో పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. 
 
దీంతో అక్కడే మాట్లాడుకుందామని, అర్థరాత్రి తన అనుచరులతో కలిసి మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. షాపులు బద్ధలు కొట్టినవారిని, పేద ప్రజలను ఇబ్బంది పెట్టినవారిని వదిలేసి తమను పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులను ఆయన ప్రశ్నించారు. 
 
సీఐతో ఫోనులో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి మనోజ్ వెళ్ళిపోయినట్టు తెలిపారు. ఇక ప్రతిరోజూ జరిగే పోలీస్ రౌండ్స్‌లో భాగంగానే ఈ తనిఖీ జరిగిందనీ మంచు మనోజ్‌పై ఎలాంటి కేసు ఫైల్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments