Webdunia - Bharat's app for daily news and videos

Install App

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

సెల్వి
శనివారం, 14 జూన్ 2025 (11:00 IST)
Manchu Lakshmi Prasanna
ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా తన కూతురితో కలిసి ప్రయాణించారనీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో విడుదల చేసింది. 
 
ఈ మేరకు ఆమె ఇన్ స్టా స్టోరీలో వీడియో షేర్ చేసింది. నేను అందరికి పర్సనల్‌గా మెసేజ్ చేశాను. అలాగే స్టోరీ కూడా పంపించా. నేను నా కూతురు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాం. తాను కూడా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేశానని తెలిపిన మంచు లక్ష్మీ, తాను లండన్ వెళ్లలేదని ముంబై వెళ్ళాను అని తెలిపారు. 
 
ఈ విషయంపై చాలా మంది తనకు ఫోన్‌లు, మెసేజ్‌లు చేశారని, మీ అందరి ప్రేమ వల్ల నేను, నా కూతురు క్షేమంగా ఉన్నాం అని తెలిపింది మంచు లక్ష్మీ. విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంచు లక్ష్మీ. విమాన ప్రమాదం గురించి ఊహించుకుంటేనే భయంగా ఉంది అన్నారు లక్ష్మీ. 
 
చాలామంది తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతో కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల తాను క్షేమంగా ఉన్నానంటూ ఒక వీడియోను విడుదల చేశారు. కాగా ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో సహా 265 మంది మరణించారు. 
 
విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని మోదీ కలిశారు. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఆరుగురిని గుర్తించిన తర్వాత, మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments