Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో విమానంలో మంచు లక్ష్మికి ఇబ్బందులు... ట్వీట్ వైరల్

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (12:15 IST)
సినీ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది వైఖరి కారణంగా తాను తీవ్ర ఇబ్బందులు పడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థకు చెందిన విమానంలో తాను ప్రయాణించగా.. ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ట్వీట్ చేశారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు.
 
తన లగేజ్ బ్యాక్‌ను పక్కకు తోసేశారని బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదనీ, వాళ్లు చెప్పినవిధంగా చేయకపోతే గోవాలోనే తన లగేజీని వదిలేస్తామని బెదిరించారని, సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. ఇదొక రకమైన వేధింపేనని తన కళ్లెదుట సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని చెప్పారు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. 
 
ఈవిధంగా ఎయిర్ లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఇకపై తాను ఈ ఎయిర్‌లైన్స్‌కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతోపాటు మరికొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడినట్టు ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments