Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్ ఇబ్రహీంతో దీపికా, రణ్ వీర్ డిన్నర్ చేశారా? ఫోటో వైరల్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (09:41 IST)
Dawood Ibrahim
అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తమ ఆర్థిక రాజధాని కరాచీలోనే ఉన్నట్టు ఇటీవల పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో రణ్‌వీర్‌, దీపికా జంట గ్యాంగ్‌స్టర్ దావూద్‌తో కలిసి డిన్నర్ చేసారని ఫోటోని ప్రూఫ్‌గా చూపిస్తూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ విషయం బాలీవుడ్ నాట చర్చనీయాంశంగా మారింది.
 
ఈ ఫోటోలో దీపికా, రణ్‌వీర్, సందీప్‌, సంజయ్‌ లీలా భన్సాలీతోపాటు మరికొంత మంది ఉన్నారు. అందులో సందీప్ పక్కన కూర్చున్న వ్యక్తి దావూద్ అని .. జస్టిస్ ఫర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ అనే పేరుతో క్రియేట్ అయిన ఓ గ్రూప్ పోస్ట్ చేసింది. 2013లో దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ జంటగా నటించిన 'గోలియోంకి రాస్‌లీలా రామ్‌లీలా' సినిమా షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఈ ఫోటో దిగగా, అందులో దావూద్ ఉన్నాడనే సరికి అందరూ షాకవుతున్నారు. 
 
అసలు విషయం ఏమంటే ఈ ఫోటోని సందీప్ సింగ్ ఈ ఏడాది మేలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా రాశాడు. ఆ ఫొటోలో దీపికా, రణ్‌వీర్‌, సంజయ్ లీలా భన్సాలీ , ఆర్ వర్మన్‌, వాసిక్ ఖాన్ తదితరులు ఉన్నారు. అయితే బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ వాసిక్ ఖాన్‌ని దావూద్ అంటూ ప్రచారం చేస్తుండడంతో దీపికా, రణ్‌వీర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదేమన్నా రోడ్డుపై వెళ్లే బస్సా? 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం డోర్ తీయబోయాడు (video)

ఉండేదేమో అద్దె ఇల్లు, కానీ గుండెల నిండా అవినీతి, గోతాల్లో డబ్బుంది

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments