ప్రాణం తీసిన అల్లరి నరేష్... 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి
హీరో అల్లరి నరేష్ భయపెట్టాడు. ఫలితంగా ఓ సినీ అభిమాని థియేటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హీరో తాజా చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. ఇటీవలే విడులైంది. ఈ చిత్రం చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సి
హీరో అల్లరి నరేష్ భయపెట్టాడు. ఫలితంగా ఓ సినీ అభిమాని థియేటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హీరో తాజా చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. ఇటీవలే విడులైంది. ఈ చిత్రం చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని శ్రీనివాస్ థియేటర్‌లో జరిగింది.
హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చూస్తూ గుండె పోటుకు గురైన ఎండి షాదుల్ (30) థియేటర్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు మృత దేహాన్ని థియేటర్ నుంచి తరలించారు.
కేసు నమోదు చేసుకొని షాదుల్ మృతిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్ - కృతిక జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది.