Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆటో ఇమ్యూన్' వ్యాధితో బాధపడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (09:56 IST)
కొంతకాలం క్రితం కేన్సర్ వ్యాధి నుంచి కోలుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్‌కు ఇపుడు మరో అరుదైన వ్యాధి సోకింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన "యమదొంగ" చిత్రంలో ఆమె ప్రత్యేక పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. దీంతో కొంతకాలం పాటు ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగారు. ఆ తర్వాత ఆమె కేన్సర్ బారినపడ్డారు. ఈ వ్యాధికి ఆమె చికిత్స తీసుకోవడంతో ఆమె కోలుకున్నారు. ప్రస్తుతం పోషకాహార నిపుణురాలిగా సోషల్ మీడియాలో ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ఆమె చేసిన ఓ ట్వీట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆమె చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడినట్టు తెలిపింది. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించింది. ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. "ప్రియమైన సూర్యుడా... నాకు గతంలో కంటే ఇపుడు నీ సూర్యకాంతి ఎక్కువ అవసరం. నేను నా రంగును కోల్పోతున్నాను. నేను ప్రతి రోజూ ఉదయం నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఆ పొగమంచులో సూర్యకిరణాలు మెరుస్తుంటే చూస్తున్నాను. అవి నన్ను తాకాలని వాటి కోసం బయటకు వస్తున్నాను. నాకు ఇపుడు వాటి అవసరం ఎంతైనాఉంది. నీ దయతో ఇక్కడ ఉన్నాను. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments