మమ్ముట్టి `గ్రేట్ శంకర్`టీజర్ వ‌చ్చేసింది

Webdunia
శనివారం, 3 జులై 2021 (17:13 IST)
varalaxmi-mammutty
మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటించిన `మాస్టర్ పీస్` సినిమా తెలుగులో `గ్రేట్ శంకర్` పేరుతో రాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కి సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్నిఎల్ వీఆర్ ప్రొడక్షన్స్ పై నిర్మాత లగడపాటి శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎల్ భార్గవ్ (నాని) ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
 
ఈ సినిమా టీజర్‌ హీరో ఆది సాయికుమార్ శనివారం విడుదల చేశారు. అనంతరం ఆది మాట్లాడుతూ, ఇండియన్ సినిమాలో మమ్ముట్టి వన్ ఆఫ్ ద గ్రేట్ స్టార్. ఆయన నటించిన "గ్రేట్ శంకర్" సినిమా టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. సినిమా టీజర్ చాలా బాగుంది. చిత్ర నిర్మాత లగడపాటి శ్రీనివాస్,  ఇతర టీమ్ కు ఆల్ ద బెస్ట్. అన్నారు.
 
నిర్మాత లగడపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ,. తమిళంలో విజయ్ "మాస్టర్" సినిమాలా "గ్రేట్ శంకర్" కూడా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. ఇటీవల "క్రాక్" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. అలాగే హీరోయిన్ పూనమ్ బజ్వా క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా టీజర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన హీరో ఆదికి థాంక్స్. అన్నారు.
 
నటీనటులు: మమ్ముట్టి, పూనమ్ బజ్వా, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు.
సాంకేతిక నిపుణులు: సంగీతం- దీపక్ దేవ్, సినిమాటోగ్రఫీః వినోద్ ఇల్లంపల్లి, ఎడిటింగ్ - జాన్ కుట్టి, స్టంట్స్ - స్టంట్స్ శివ, దిలీప్ సుబ్రయాన్, పీఆర్వో - జి ఎస్ కె మీడియా, నిర్మాత - లగడపాటి శ్రీనివాస్, దర్శకత్వం - అజయ్ వాసుదేవ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments