Adi Sai Kumar,Payal Rajput
ఆది సాయికుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `కిరాతక` అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పూత్ నటిస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఎం. వీరభద్రం మాట్లాడుతూ, ఆది కుమార్ హీరోగా నేను దర్శకత్వం వహించిన చుట్టాలబ్బాయి సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. మరోసారి మా ఇద్దరి కాంబినేషన్‌లో అద్భుతమైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆది సరసన పాయల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా నటిస్తుంది. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి అన్‌కాంప్రమైజ్‌డ్‌గా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్‌రెడ్డి గారి విజువల్స్ తప్పకుండా సినిమాకి ప్లస్ అవుతాయి` అన్నారు.
చిత్ర నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, మా విజన్ సినిమాస్ బ్యానర్‌లో ఆది సాయికుమార్ , ఎం. వీరభద్రం గారి కాంబినేషన్‌లో `కిరాతక`అనే చిత్రం రూపొందిస్తున్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ వీరభద్రం గారు చెప్పిన కథ బాగా నచ్చింది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం` అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిర్మల్ రెడ్డి యాళ్ల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం.వీరభద్రం.