Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లికా షెరావత్ నడుం మీద చపాతీలు కాల్చుకోవచ్చా...

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (08:21 IST)
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్. వెండితెరకు అరంగేట్రం చేసిన తొలినాళ్ళలోనే మర్డర్ చిత్రంలో అందాలు ఆరబోసి హాట్‌టాపిక్‌గా నిలించారు. ఆ తర్వాత వరుస సినీ అవకాశాలు చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా అవతరించారు. అయితే, ఈ భామ త్వరలోనే ఓ టాలీవుడ్ చిత్రంలో నటించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ది లవ్‌ లాఫ్ లివ్‌ షో’లో ఈ బోల్డ్ బ్యూటీ పాల్గొంది. 
 
ఈ సందర్భంగా ఒకానొక సందర్భంలో తనకు ఒక ప్రొడ్యూసర్ చేసిన వింత సూచనను బయటపెట్టింది. ఒక సినిమాలో మంచి హాట్‌ సాంగ్‌ చేస్తున్న సమయంలో ఆ చిత్ర నిర్మాత లొకేషన్‌కు వచ్చి... 'నీలో వేడి ఉందని ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది? నీలో ఎంత వేడి ఉందంటే నీ నడుం మీద చపాతీలు వేసుకోవచ్చు' అంటూ సీన్‌ వివరించాడట.
 
దానికి మల్లికా షెరావత్ స్పందిస్తూ, ‘లేదు, మనం ఖచ్చితంగా అలాంటి పని చేయడం లేదు’ అని ఆమె ఆ ప్రొడ్యూసర్‌కు కరాఖండీగా చెప్పేసిందట. ఈ విషయం ఆమె చెప్పడంతో ప్రోగ్రాంలో పాల్గొన్న వారంతా నవ్వుకున్నారు.
 
ఇదిలావుంటే, ఈమె తెలుగు సినిమాలో నటిస్తోంది. పిరీడ్ డ్రామా కథాంశంతో తెరకెక్కే నాగమతి చిత్రంలో మ‌ల్లికా కీలక పాత్ర పోషించ‌నుంద‌ని అంటున్నారు. అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు.
 
ముంబైలో ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, త్వ‌ర‌లో మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇందులో న‌టించే న‌టీనటులు ఎవ‌రు, త‌దిత‌ర విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. కాగా, మల్లికా శెరావత్.. ప్రస్తుతం కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. తరచూ తన ఫోటోల్ని షేర్ చేస్తుంటుంది. ఆమె ఫోటోల కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments