Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లోడి అడుగుపెడుతున్న "మర్డర్" బోల్డ్ బ్యూటీ

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (12:30 IST)
'మర్డర్' చిత్రం బోల్డ్‌గా నటించి విమర్శలతో పాటు ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఈమె తొలిసారి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. పిరీడ్ డ్రామా కథాంశంతో తెరకెక్కే 'నాగమతి' చిత్రంలో మ‌ల్లికా కీలక పాత్ర పోషించ‌నుంద‌ని అంటున్నారు. అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు.
 
నిజానికి మల్లికా షెరావత్‌కు 'మర్డర్' చిత్రం తర్వాత దశ తిరిగిపోయిందని చెప్పాలి. బాలీవుడ్‌లో బోల్డ్‌ నటిగా గుర్తింపు పొందడమే కాకుండా ఈ చిత్రంలో మ‌ల్లికా షెరావ‌త్ మ‌తులు పోగొట్టే అందాల‌తో క‌వ్వించింది. కెరీర్ ఆరంభంలోనే మ‌ల్లికా ఇంత‌గా అందాలు ఆర‌బోయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటిని ఆమె లైట్‌గా తీసుకున్నారు. పైగా, విమర్శలపై కాకుండా తన సినీ కెరీర్‌పై దృష్టిసారించారు. ఇపుడు తొలిసారి ఓ తెలుగు సినిమాలో నటించేందుకు సమ్మతించారు. 
 
ముంబైలో ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, త్వ‌ర‌లో మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇందులో న‌టించే న‌టీనటులు ఎవ‌రు, త‌దిత‌ర విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. కాగా, మల్లికా శెరావత్.. ప్రస్తుతం కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగికదాడి : నిందితుడుని గుర్తించి బాధితురాలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments