Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్ బాహుబ‌లి - మ‌ర‌క్కార్ అమెజాన్‌లో రాబోతోంది!

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (16:49 IST)
Marakkar - mohanlal
క‌రోనా త‌ర్వాత థియేట‌ర్లు తెరుచుకుని పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన్న త‌రుణంలో ఓటీటీ అమెజాన్ దూకుడు పెరిగింది. ప‌లు మ‌ల‌యాళ చిత్రాల‌ను విడుద‌ల చేసిన అమెజాన్ ఈసారి మ‌ర‌క్కార్ ను విడుద‌ల చేయ‌బోతోంది. మోహ‌న్‌లాల్‌,  ప్రియదర్శన్ ల క‌ల‌ల సినిమా `మ‌ర‌క్కార్‌` వెండితెర‌పై కంటే ఓటీటీలో రాబోతుంది. మాలీవుడ్‌లో బాహుబ‌లి సినిమాగా పేరు పొందిన ఈ సినిమాకు వంద కోట్ల ఖ‌ర్చుతో నిర్మించారు. మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ అని కాప్ష‌న్‌తో రూపొందిన ఈ సినిమా త్వ‌ర‌లో అమెజాన్‌లో రాబోతుంది. అయితే దీనిపై పంపిణీదారులు చాలా నిరుత్సాహంతో వున్నారు.
 
క‌థ‌రీత్యా కుంజాలి పాత్ర‌ను మోహ‌న్‌లాల్ పోషించాడు. కుంజాలి ఆఖ‌రి ర‌క్త‌పుబొడ్డు వ‌ర‌కు ప‌ర‌దేశీయుల‌ను రానివ్వ‌న‌ని మోహ‌న్‌లాల్ డైలాగ్‌లు ఆమ‌ధ్య విడుద‌లై అనూహ్య‌స్పంద‌న ల‌భించింది. కుంజాలి చిన్న‌త‌న‌పు పాత్ర‌ను మోహ‌న్ లాల్ త‌న‌యుడు  ప్ర‌ణ‌వ్ పోషించాడు. ఇందులో అర్జున్‌, సుహాసిని, సునీల్‌శెట్టి, సుదీప్ వంటి ఎంతోమంది తార‌లు న‌టించారు. 
 
67వ జాతీయ పుర‌స్కారాల‌లో మ‌ర‌క్కార్‌కు  కాస్ట్యూమ్స్‌తోపాటు ప‌లు శాఖ‌ల‌కు అవార్డులు ద‌క్కాయి. మోహ‌న్‌లాల్‌తో 45 సినిమాలు చేసిన ప్రియ‌ద‌ర్శిన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా 2020లో విడుద‌ల‌కావాల్సి వున్నా కోవిడ్ కార‌ణంగా విడుద‌ల కాలేదు. అయితే ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధ‌మైంది. అమెజాన్ భారీ ఆఫ‌ర్ ఇవ్వ‌డం విశేసం. అయినా స‌రే పంపిణీదారులు ఆందోల‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్,  సంగీతం రోన్నీ రాఫేల్, రాహుల్ సమకూర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?

Lokesh: జగన్ గారికి మొబైల్ కొనిపెట్టండి.. నా జేబులో నుండి 10 కోట్లు ఇస్తాను: నారా లోకేష్

తెలంగాణ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్: కీలక మార్గదర్శకాలు విడుదల- విద్యార్థులు పరీక్షా హాలులోకి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments