Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళ సూపర్ స్టార్ హీరోగా మహానేత "వైఎస్ఆర్ బయోపిక్"

చిత్రసీమలో బయోపిక్‌ల కాలంనడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు బయోపిక్‌ల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు సూపర్ హిట్ ఖాతాలో చేరాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రముఖుల జీవిత చరిత్రలు ఆధారంగా పలు చిత్రాలు

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (12:04 IST)
చిత్రసీమలో బయోపిక్‌ల కాలంనడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు బయోపిక్‌ల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు సూపర్ హిట్ ఖాతాలో చేరాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రముఖుల జీవిత చరిత్రలు ఆధారంగా పలు చిత్రాలు నిర్మితంకానున్నాయి. ఈ కోవలో మహానటి సావిత్రి, స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్రల ఆధారంగా రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' పేరుతో ఓ చిత్రాన్ని తీస్తున్నారు. 
 
ఇపుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా ఓ బయోపిక్‌ రాబోతోంది. ఇందులో రాజశేఖర్‌ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నట్లు టాలీవుడ్‌ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గతంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌.. నటుడు రాజశేఖర్‌తో కలిసి వైఎస్సార్‌ బయోపిక్‌ తీయాలని భావించారు.
 
కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు 'ఆనందో బ్రహ్మ' వంటి బ్లాక్‌‌బస్టర్‌ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి.రాఘవ్‌ వైఎస్సార్‌ బయోపిక్‌ తెరకెక్కించనున్నారు. ఇందుకు వైఎస్సార్‌ కుమారుడు, వైకాపా అధినేత జగన్‌ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. త్వరలో బయోపిక్‌కు సంబంధించిన వివరాలను రాఘవ్‌ అధికారికంగా వెల్లడించనున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments