Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాసుకీ రివ్యూ రిపోర్ట్: అత్యాచార బాధితురాలిగా నయన.. ఆ ముగ్గురిని ఎలా చంపింది?

మలయాళంలో హిట్టైన పుదియ నియమమ్ అనే చిత్రాన్ని తెలుగులో వాసుకిగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో వాసుకిగా టైటిల్ రోల్‌ను నయనతార పోషించింది. గ్లామర్ రోల్స్ చేస్తూ.. యువతను ఆకట్టుకున్న నయనతార ఈ చిత్రంలో అత్యాచ

Advertiesment
వాసుకీ రివ్యూ రిపోర్ట్: అత్యాచార బాధితురాలిగా నయన.. ఆ ముగ్గురిని ఎలా చంపింది?
, శుక్రవారం, 28 జులై 2017 (15:55 IST)
సినిమా పేరు : వాసుకీ
నటీనటులు: నయనతార, మమ్ముట్టి, బేబీ అనన్య, శీలూ అబ్రహం తదితరులు
దర్శకత్వం: ఏకే సాజన్ 
నిర్మాత: ఎస్ఆర్ మోహన్
సంగీతం: గోపి సుందర్
విడుదల తేదీ : జూలై 28, 2017
 
మలయాళంలో హిట్టైన పుదియ నియమమ్ అనే చిత్రాన్ని తెలుగులో వాసుకిగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో వాసుకిగా టైటిల్ రోల్‌ను నయనతార పోషించింది. గ్లామర్ రోల్స్ చేస్తూ.. యువతను ఆకట్టుకున్న నయనతార ఈ చిత్రంలో అత్యాచార బాధితురాలిగా నటించింది. 
 
కాష్మోరా, డోరా వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటనపరంగా అదరగొట్టిన నయనతార వాసుకిలోనూ వన్ వుమెన్ షో చేసింది. సినిమా మొత్తం అంతా తానై నడిపించింది. మలయాళ నటుడు మమ్ముట్టి వాసుకికి భర్తగా నటించినా.. ఆయన పాత్రకు ప్రాధాన్యం లేకుండా వాసుకినే సినిమా మొత్తం కనిపించింది. 
 
సినిమా కథలోకి వెళ్తే.. కథక్ డ్యాన్సర్ అయిన వాసుకీగా నయన కనిపిస్తుంది. ఈమెకు భర్తగా మమ్ముట్టి కనిపిస్తాడు. వాసుకీ దంపతులకు ఓ కుమార్తె వుంటుంది. వీరి దాంపత్య జీవితం చక్కగా సాగుతున్న వేళ.. వాసుకీని ఆమె అపార్ట్‌మెంట్లో వుండే ముగ్గురు యువకులు అత్యాచారం చేస్తారు. ఈ ఘటనతో భర్తకు, కుమార్తె కాస్త దూరమై.. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. 
 
ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ వాసుకికి సహాయపడుతుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ ముగ్గురిని హతమార్చాలని కోరుతుంది. కానీ ఇంతలో వాసుకీపై రేప్ చేసిన వారిని మరో వ్యక్తి చంపాలనుకుంటాడు. అతనెవరు? అతినికి వాసుకికి లింకుందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ : 
తొలిభాగం నెమ్మదిగా సాగుతుంది. రెండో భాగంలో నయన నటన ప్రేక్షకులను సీటుకే కట్టిపడేస్తుంది. తొలిభాగంలో మమ్ముట్టి, నయనతార, కుమార్తెల మధ్య సీన్లు పండించాడు. కానీ కామెడీ బాగా మిస్సయ్యింది. డబ్బింగ్ సినిమా కావడంతో ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఇంటర్వెల్‌కు తర్వాత సినిమా ప్రేక్షకులకు ఆసక్తి కలిగించింది. నయన చేసే మూడు హత్యలు, ఆమె నటన బాగుంది. సినిమా చివర్లో ట్విస్ట్ ఇవ్వడం సినిమాకు మైనస్ అయ్యింది.
 
నయన నటన అదిరింది. తన పాత్రకు చక్కగా ఒదిగిపోయింది. ఇక ప్రాధాన్యత లేని పాత్రైనా మమ్ముట్టి అంగీకరించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. వాసుకీ మాత్రమే సినిమా మొత్తం కనిపిస్తుంది. సినిమాకు రీరికార్డింగ్ హైలైట్‌గా నిలిచింది. ఫోటోగ్రఫీ, మ్యూజిక్ బాగున్నాయి.
 
ప్లస్ పాయింట్ల్ 
నయనతార నటన 
మమ్ముటి పాత్ర 
స్క్రీన్ ప్లే
 
మైనస్ 
పరిచయం లేని నటులు
డబ్బింగ్ సినిమా కావడం 
ఫస్టాఫ్ ఆకట్టుకోకపోవడం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శేఖర్ కమ్ముల ఎంతగానో రిక్వెస్ట్ చేస్తేనే అలా చూపించా... ఇక చూపించను... 'ఫిదా' సాయిపల్లవి