Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శేఖర్ కమ్ముల ఎంతగానో రిక్వెస్ట్ చేస్తేనే అలా చూపించా... ఇక చూపించను... 'ఫిదా' సాయిపల్లవి

ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్... ఇలా ఏ 'వుడ్'లలో చూసినా సాయిపల్లవి పేరు మారుమోగిపోతోంది. ఈ నేచురల్ బ్యూటీతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు కూడా ఎగబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా 10 సినిమాలకు సాయిపల్లవి గ్రీన్

Advertiesment
Talk of the Tollywood
, శుక్రవారం, 28 జులై 2017 (15:34 IST)
ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్... ఇలా ఏ 'వుడ్'లలో చూసినా సాయిపల్లవి పేరు మారుమోగిపోతోంది. ఈ నేచురల్ బ్యూటీతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు కూడా ఎగబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరుసగా 10 సినిమాలకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఫిదా చిత్రంలో ఓ చోట సాయిపల్లవి స్లీవ్‌లెస్ దుస్తుల్లో కాస్తంత గ్లామర్ ఒలకపోస్తూ కనిపిస్తుంది. దాన్ని ఉదాహరణగా తీసుకుని కొంతమంది దర్శకనిర్మాతలు... ఎక్స్‌పోజింగ్ చిత్రాలు కూడా చేస్తారా అని అడుగుతున్నారట. 
 
వాళ్లందరికీ పేరుపేరునా చెప్పేకంటే ఒకేసారి తను ఎక్స్‌పోజింగ్ చేయను అనే దానికి ఓ ఉదాహరణ చెప్పిందట సాయి. అదేంటయా అంటే... ఫిదా చిత్రంలో సాయిపల్లవి ఓచోట స్లీవ్‌లెస్‌తో కనబడుతుంది. అలా కనిపించేందుకు సాయిపల్లవి ససేమిరా అన్నదట. కానీ సినిమా డిమాండ్ మేరకు ఖచ్చితంగా అలా కనబడి తీరాల్సిందేనని శేఖర్ కమ్ముల ఎంతగానో బ్రతిమలాడితో చిట్టచివరికి అంగీకరించిందట. 
 
ఇకపై ఇలాంటి సీన్లు... అదే స్లీవ్‌లెస్‌తో నటించే సీన్లు చేయనని స్పష్టం చేసిందట సాయిపల్లవి. ఐతే మొదట్లో ఇండస్ట్రీకి వచ్చేవారంతా ఇలాంటి డైలాగులే చెప్తారనీ, ఆ తర్వాత సన్నివేశాల డిమాండ్ల మేరకు మెల్లమెల్లగా అన్నీ చూపిస్తూ ముందుకెళ్తారంటూ కొందరు సినీజనం చెప్పుకుంటున్నారు. మరి సాయిపల్లవి ఇలా చేస్తుందో లేదంటే చెప్పినట్లే ఏమీ చూపించకుండా అలాగే వుంటుందో... వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గౌతమ్ నంద రివ్యూ రిపోర్ట్: అబ్బా.. సెంటిమెంట్ ఓవర్‌డోస్- కానీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా?