లేడి యాంకర్‌పై విరుచుకుపడిన కుర్రహీరో అరెస్ట్

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (23:11 IST)
Sreenath Bhasi
లేడి యాంకర్‌పై విరుచుకుపడిన మలయాళ కుర్ర హీరో శ్రీనాథ్ బాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. కప్పెలా, భీష్మ పర్వం, ట్రాన్స్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీనాథ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం చట్టంబి విడుదలకు సిద్ధమవుతోంది. 
 
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓ టీవీ ఛానల్ లేడి యాంకర్‌పై విరుచుకుపడ్డారు. అసభ్యమైన పదజాలంతో ఆమెను దుర్భాషలాడడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను మాట్లాడిన మాటలను రికార్డు చేసి పోలీసులకు వినిపించింది. 
 
ఇక దీంతో అతడిపై విమెన్ హెరాస్మెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. అయితే శ్రీనాథ్ ఈ అరెస్ట్‌ను ఖండించాడు. ఆమె తనను రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు అడిగిందని, అందుకే తాను ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వెల్లడించాడు. 
 
అంతేకాకుండా ఇంటర్వ్యూలో మర్యాద లేకుండా సిల్లీ ప్రశ్నలు వేసి అవమానించినట్లు కూడా చెప్పుకొచ్చాడు. తన పేరును చెడగొట్టడానికే ఆ యాంకర్ ఆడియో క్లిప్‌ను తనకు అనుకూలంగా చేసుకొని సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చినట్లు తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష

Chiranjeevi: డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీ చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి డిమాండ్ (video)

ఏం చెట్టురా అది, ఆ చెట్టు పడిపోకూడదు, బ్రతకాలి (video)

మద్యం తాగి ఇంట్లో పడొచ్చుకదా.. ఇలా రోడ్లపైకి ఎందుకు.. బైకును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టీచర్ (video)

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments