Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరింకా 'యాత్ర-2' చూడలేదు.. అపుడే మాట్లాడితే ఎలా? దర్శకుడు మహి వి.రాఘవ్

ఠాగూర్
బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (10:48 IST)
గతంలో వైఎస్ఆర్ జీవితం ఆధారంగ్ తెరకెక్కిన చిత్రం "యాత్ర". ఇపుడు దీనికి సీక్వెల్ రాదనుంది. "యాత్ర-2" పేరుతో వచ్చే ఈ చిత్రం ఈ నెల 8వ తేదీన విడుదలవుతుంది. అయితే, ఎన్నికల సమయంలో వైకాపా నేతలే ఉద్దేశ్యపూర్వంగానే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగాను, సీఎం జగన్‌మోహన్ రెడ్డిని గొప్పగా చూపించినట్టుగా ఈ చిత్రం ఉందనే ప్రచారం సాగుతుంది. దీనిపై ఆ చిత్ర దర్శకుడు మహి వి.రాఘవ్ స్పందించారు. 
 
గతంలో వచ్చిన యాత్ర చిత్రానికి ఇది సీక్వెల్. తొలి భాగంగా మమ్మూట్టి ప్రధాన పాత్రను పోషిస్తే, రెండోభాగంలో తమిళ హీరో జీవా కథనాయకుడి పాత్రను పోషించారు. ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా నేత జగన్మోహన్ రెడ్డిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయని అలాంటి వ్యక్తిని గొప్ప నేతగా చూపించాల్సిన అవసరం ఏముందని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు దర్శకుడు సమాధానమిచ్చారు. 
 
ఈ చిత్రంలో ఎవరినీ గొప్పగా చూపించడం అనేది ఉండదన్నారు. "మీరింకా యాత్ర-2 సినిమాను చూడలేదు, అప్పుడే మాట్లాడితే ఎలా? నేనొక వెర్షన్ అనుకున్నాను... దాన్నే చూపిస్తున్నాను. ఇక కేసులంటారా... ఇప్పుడున్న అందరు నేతలపైనా కేసులున్నాయి. మొన్నటివరకు మనం ఒకరినే ఎత్తిచూపించాం... ఇప్పుడు మిగతావాళ్లపైనా కేసులు ఉన్నాయి. కథను కథగానే చూడాలి. మనం డప్పు కొట్టుకున్నామా అనే విషయం ఆడియన్స్ తేలుస్తారు.
 
ఇందులో ఎవరినీ టార్గెట్ చేయలేదు. ఆయన జీవితంలో కొన్ని పరిణామాలు జరిగాయి. కొందరిని ఎదిరించాడు, పార్టీలోంచి బయటికి వచ్చాడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు... సినిమాలో వీటినే చూపించాం. అంతేతప్ప విలన్, హీరో అంటూ ఏమీ ఉండదు... పరిస్థితుల ఆధారంగా సన్నివేశాలు ఉంటాయి" దర్శకుడు మహి వి. రాఘవ్ పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments