Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య ద‌ర్శ‌కురాలితో మ‌హేష్‌బాబు సినిమా!

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (17:26 IST)
Maheshbabu,looking new movie
ప్ర‌ముఖ హీరోతో సినిమాలు చేసిన ద‌ర్శ‌కుల‌తో స్టార్‌లు సినిమాలు చేయ‌డం మామూలే. పూరీజ‌గ‌న్నాథ్‌, వినాయ‌క్, వంశీ పైడివ‌ల్లి, అనిల్ రావిపూడి వీరంతా వుండ‌గా మ‌హిళా ద‌ర్శ‌కురాలితో సినిమా చేయ‌డానికి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఆమ‌ధ్య వెంక‌టేష్‌తో `గురు` సినిమాను రూపొందించిన సుధా కొంగ‌ర ఆ చిత్ర విజ‌యంతో అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత త‌మిళంలో సూర్య హీరోగా సురరై పోట్రు ( తెలుగులో ఆకాశశమే నీ హద్దురా ) సినిమా తీసి మెప్పించింది. ఓ సామాన్యుడు ఉన్న‌త‌స్థాయికి ఎలా ఎద‌గ‌గ‌లడో ఆ చిత్రంలో చెప్పింది. ఆ సినిమా విడుద‌ల‌య్యాక మ‌హేష్‌బాబు మంచి సినిమా చూశాన‌న్న ఫీలింగ్ క‌లిగింద‌ని ట్వీట్ చేశాడు. కృషి, ప‌ట్టుద‌ల‌తోపాటు అన్ని అనుకూలిస్తే సామాన్యుడు పైకి ఎలా ఎద‌గ‌గ‌ల‌డు, ప‌దిమందికి స్పూర్తిగా ఎలా నిల‌వ‌గ‌డ‌ద‌నేది ఈ చిత్ర సారాంశం. ఇలాంటి మోటివేటివ్ చేసే సినిమాలు చేయాల‌నేది ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు ముందున్న క‌ర్త‌వ్యం. 
 
గ‌త ఏడాది సంక్రాంతికి కూడా అలాంటి స్పూర్తిదాయ‌క సినిమా చేసి అనిల్‌రావిపూడితో మ‌హేష్‌బాబు స‌క్సెస్ సాధించాడు. ఇప్పుడు మ‌హేష్‌బాబు దుబాయ్‌లో `స‌ర్కారు వారి పాట‌` సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఈ సినిమా చేస్తూనే మరో సినిమా ను లైన్ లో పెట్టె ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్న మహేష్ బాబు సుధా కొంగ‌ర‌తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిన‌ట్లు తెలుస్తోంది. ఆ సినిమా క‌థ‌ను కూడా మ‌హేష్‌కు సూచ‌న ప్రాయంగా తెలిపిన‌ట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం వుంద‌ని స‌మాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments