Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిద్ధ్‌ శ్రీరామ్‌, చందబ్రోస్‌కు కలిసివచ్చిన రెండు పాటలు

Advertiesment
Siddh SriRam
, సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (16:56 IST)
Sidh Sriram, Saikumar, Chadrabose
గీత రచయిత చంద్రబోస్‌కు లాక్‌డౌన్‌లోనూ ఆ తర్వాత కూడా కలిసి వచ్చిందంటున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో రాసిన ‘నీలి నీలి ఆకాశం.’ పాట ఊహించని ఆదరణ పొందింది. 300 మిలియన్‌ వ్యూస్‌ రావడమే అందుకు కారణం. సిద్‌శ్రీరామ్‌ ఆపించిన ఆ పాటకు అనూప్‌ రూబెన్స్‌ బాణీు సమకూర్చారు. ఇపుడు తాజాగా ఆది సాయికుమార్‌, సురభి జంటగా నటించిన ‘శశి’ సినిమాలో ‘ఒకే ఒక లోకం’ అనే పాటను రాశారు. దానిని సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆపించారు. అరుణ్‌ అనే వర్ధమాన సంగీత దర్శకుడు బాణీలు స‌మ‌కూర్చాడు. వెరసి ఈ పాట 20 మిలియన్స్‌కు చేరుకుంది. ఇక ఫిబ్రవరి 5న సినిమా విడుద తర్వాత మరింత ఆదరణ పొందుతోందని చందబ్రోస్‌ చెబుతున్నారు.
 
అస‌లు ఈ పాట నేపథ్యం గురించి ఆయన చెబుతూ.. ‘ఒకేఒక లోకం.’ అనే పాట అందరూ అన్వయించుకుంటున్నారు. ప్రేయసీ ప్రియులేకాదు, అమ్మానాన్న, పిల్ల‌లు త‌మ‌ బంధాన‌న్నింటినీ క‌లుపుకుని పాడుకునేలా సార్వజనీనమైనందుకు ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ వుంది. ఈ పాట జన్మవృత్తాంతం చెప్పాలంటే, సంగీత దర్శకుడు అరుణ్‌, నిర్మాత వర్మగారు నా దగ్గరకు వచ్చి బాణీ వినిపించి పాటరాయమన్నారు. రాసి వినిపించగానే చరణాలు బాగున్నాయి. కానీ ప‌ల్ల‌వి ఇంకాస్త బాగుంటే మంచిది అన్నారు. మీకేమి కావాల‌ని అడిగితే.. పాటలో ‘వసంతం, రాగం, నువ్వు ఎదురొస్తావనీ..’ అనేవి వుండాల‌ని చెప్పారు. దానిని బట్టి రాసిన పాట ‘నువ్వు నాతో వున్నావంటే, నువ్వు ఎదురు వున్నావంటే వసంతమైన వస్తూవుండే రాగంలా..’ అంటూ రాశాను. అది విని బాగుందని వెళ్ళిపోయారు. కానీ నాకు మాత్రం అరుణ్‌ మనస్సుకు నచ్చలేదని అర్థమైంది. 
 
అందుకే నేను రోజంతా ఆలోచించి పాటను మెరుగుదిద్దాను. వారిని తర్వాత రోజు పిలిచాను. వచ్చారు. అపుడు రాసిన పాట ‘ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో అందం నువ్వే, అందానికి హృదయం నువ్వే, ఎకాఎకి కోపం వస్తే దీపం నువ్వే..’ అంటూ వినిపించగానే అరుణ్‌కు మనస్పూర్తిగా నచ్చి కృతజ్ఞతలు తెలిపారు. వారికేకాదు ఈ పాట రెండు కోట్ల 10 లక్షల మందికి నచ్చడం చాలా ఆనందంగా వుంది. చెన్నయ్‌లో కూడా ఓ షూటింగ్‌లో ఈ పాటను అనువదించుకుని పాడుకుంటున్నారు. అది వింటుంటే చెప్పలేని ఆనందం వేస్తుంది. అందుకే 2020, 2021 రెండు సంవత్సరాలు నాకూ, సిధ్‌శ్రీరామ్‌కు కలిసివచ్చింది. ఈ పాటను సాయికుమార్‌ కుమారుడు ఆదికి రాయడం నాకూ సంతోషంగా వుంది. ఎప్పుడో రాయాల్సింది కానీ ఇలా 2021లో ఆయనకు పాట రాసే అవకాశం కల్గింది. ఈ పాటే సినిమా హాలుకు ప్రేక్షకుల్ని తీసుకువస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AnushkaSharma అనుష్కశర్మ-విరాట్ కోహ్లిల ముద్దుల కుమార్తె పేరు వామికా, ఫస్ట్ పిక్ షేర్