ర‌జినీకాంత్ ద‌ర్బార్ పోస్ట‌ర్‌ను ఎవ‌రు రిలీజ్ చేయ‌నున్నారో తెలుసా?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (14:23 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు ఏ ఆర్ మురుగదాస్‌ల తొలి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దర్బార్. రజిని ఒక మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగుల కలబోతగా మురుగదాస్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రజిని పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. 
 
ఈ సినిమా తెలుగు మోషన్ పోస్టర్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. అలానే ఈ సినిమా హిందీ, తమిళ మరియు మలయాళ మోషన్ పోస్టర్స్‌ను సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, మోహన్ లాల్ రిలీజ్ చేయబోతున్నారు. 
 
రజిని సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments