Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ - త్రివిక్రమ్ సినిమా ఇదిగో సాక్ష్యం..!

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (20:27 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రాలు అతడు, ఖలేజా. ఈ రెండు చిత్రాలు అటు మహేష్ బాబుకి ఇటు త్రివిక్రమ్‌కి మంచి పేరు తీసుకువచ్చాయి. ఈ రెండు సినిమాలు చేస్తున్న టైమ్‌లో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు కానీ.. ఇప్పటివరకు సెట్ కాలేదు.
 
దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. అందుకే సినిమా చేయడం లేదని టాక్ వచ్చింది. రీసెంట్‌గా మహేష్‌ - త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని టాక్ వచ్చింది. అయితే.. వీరిద్దరూ కలిసి సినిమా చేయడానికి ఓకే కానీ.. ప్రస్తుతం మహేష్‌ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు కాబట్టి ఇప్పట్లో త్రివిక్రమ్‌తో సినిమా ఉండకపోవచ్చు అనుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ఖలేజా చిత్రం నేటికి సరిగ్గా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్‌ బాబు స్పందిస్తూ... ఖలేజా సినిమా జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అంతేకాకుండా.. అతి త్వరలో ప్రారంభం కానున్న మన నెక్ట్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అంటూ మహేష్‌ బాబు త్రివిక్రమ్‌తో సినిమా కోసం హింట్ ఇచ్చాడు.
 
మహేష్‌ ట్వీట్‌తో త్రివిక్రమ్‌తో సినిమా కన్ఫర్మ్ అని తెలిసింది. మరి.. ఎప్పుడు ప్రకటిస్తారో...? ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని ఎవరు నిర్మిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments