Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహర్షి'' నుంచి టీజర్ అవుట్.. సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్ వుండవ్.. (Video)

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (11:27 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా, అల్లరి నరేష్ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న మహర్షి చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై సి.అశ్వినీదత్, దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. 
 
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన నిర్మాతలు.. ఉగాది సందర్భంగా సందర్భంగా యూనిట్ మహేశ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ అందించింది. ఉదయం 9.09 గంటలకు మహర్షి టీజర్‌ను రిలీజ్ చేశారు.
 
''సక్సెస్‌లో పుల్‌స్టాప్స్ ఉండవ్.. కామాస్ మాత్రమే.. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. ఈజ్ ఏ జర్నీ, నాకో ప్రాబ్లెమ్ ఉంది సర్.. ఎవడైనా నువ్ ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు'' అని మహేశ్ చెబుతున్న డైలాగులు అదిరిపోయాయి. బిజినెస్ మెన్, స్టూడెంట్ పాత్రల్లో మహేశ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. 
 
యాక్షన్ కూడా బాగానే దట్టించినట్లు తెలుస్తోంది. మహేశ్ కెరీర్‌లో మహర్షి 25వ సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సుమారు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఉగాది రోజున విడుదలైన టీజర్‌ను ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవదహనం

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.5గా..?

వేసవిలో వేడిగాలులు... ఈ సమ్మర్ హాట్ గురూ... బి అలెర్ట్.. 10 వేడిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments