Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్ బర్త్‌డే స్పెషల్ : 'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ రిలీజ్

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (11:21 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 45వ పుట్టినరోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయన తన తాజా చిత్రం సర్కారు వారి పాట మోషన్ పోస్టర్‌ను రిలీజ చేశారు. అలాగే, ప్రిన్స్‌ మ‌హేష్‌కి అభిమానులు, సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది. నెల రోజుల ముందు నుండే సోష‌ల్ మీడియాలో మ‌హేష్ బ‌ర్త్‌డే హంగామా మొద‌లు కాగా, ఆయ‌న బ‌ర్త్‌డేకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
 
సూపర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ న‌టుడిగానే కాకుండా మాన‌వ‌తావాదిగా అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ, ఆప‌ద‌లో ఉన్న వారికి ఆప‌న్న‌హ‌స్తంగా నిలుస్తూ ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. నేడు త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌హేష్ ప్లాస్మా దానం చేయాలంటూ అభిమానుల‌తో పాటు ప్ర‌జ‌ల‌కి పిలుపునిచ్చారు.
 
కాగా, వెండితెరపై బాల న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ 'రాజ‌కుమారుడు' సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. అత‌డు, పోకిరి, బిజినెస్ మెన్‌, దూకుడు ఇలా ప‌లు చిత్రాల‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన మ‌హేష్ టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఎదిగాడు. 
 
ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో "స‌ర్కారు వారి పాట" అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంకి సంబంధించిన పోస్ట‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఈ రోజు మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌రును రిలీజ్ చేశారు. 
 
ఇందులో మ‌హేష్ కాయిన్‌ని గాల్లోకి ఎగిరివేయ‌డాన్ని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. చేతికి ఓం అనే లాకెట్ కూడా టీజ‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ సినిమాలో ముఖ్యంగా అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్. థ‌మ‌న్ సంగీతం బాణీలు అందించే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments