Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌రిలేరు నీకెవ్వ‌రులో మ‌హేష్ పేరు ఇదా..?

Webdunia
గురువారం, 11 జులై 2019 (22:27 IST)
సూపర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తోన్న తాజా చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. వ‌రుసగా విజ‌యాలు సాధిస్తోన్న అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ సినిమా అని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి క‌థ ఏంటి.? మ‌హేష్ ని ఏ పాత్ర‌లో చూపించ‌నున్నాడు అనే ఆస‌క్తి ఏర్ప‌డింది.
 
ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు కనిపించనున్నాడనే టాక్ చాలా రోజుల క్రితమే బయటికి వచ్చింది. రీసెంట్ గా షూటింగ్ స్పాట్ నుంచి మహేష్‌ బాబు లుక్ ఒకటి బయటికి వచ్చింది. ఇదిలా ఉంటే... చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ... ఈ సినిమాలో మహేష్‌ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. కశ్మీర్లో ఆపరేషన్ స్టార్ట్ అయిందంటూ, షూటింగ్ మొదలైందనే విషయం చెప్పాడు. 
 
అంతే కాకుండా మ‌హేష్ పాత్ర పేరు తెలిసేలా ఓ ఫోటోను రిలీజ్ చేసారు. అలాగే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్న విషయాన్ని స్పష్టం చేశాడు. మ‌రి...ఈ సంక్రాంతికి ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments