Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్ కమ్ బ్యాక్ సార్ అంటూ చిరు.. హేట్సాఫ్ అంటూ బాలకృష్ణను ప్రశంసించిన ప్రిన్స్

సంక్రాంతికి విడుదలైన రేసులో విడుదలైన రెండు భారీ సినిమాలపై సెలెబ్రిటీల జాబితాలో మరో స్టార్ హీరో చేరిపోయాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 'గౌతమిపుత్ర శాతకర్ణి', చిరు 'ఖైదీ నెం.150'పై స్పందించాడు. రెండు

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (12:03 IST)
సంక్రాంతికి విడుదలైన రేసులో విడుదలైన రెండు భారీ సినిమాలపై సెలెబ్రిటీల జాబితాలో మరో స్టార్ హీరో చేరిపోయాడు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 'గౌతమిపుత్ర శాతకర్ణి', చిరు 'ఖైదీ నెం.150'పై స్పందించాడు. రెండు సినిమాలపై స్పందించడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకున్నాడు.

ఈ రెండు సినిమాలను త్వరలోనే చూస్తానన్నాడు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్..'' ఈ సంక్రాంతికి విజయాల వర్షం కురుస్తోంది. త్వరలోనే రెండు సినిమాలను చూడబోతున్నానని చెప్పాడు. చిరు 150వ సినిమాలో తన నటనతో మ్యాజిక్ చేశారు. చాలా సంవత్సరాలుగా మిమ్మల్ని మిస్ అయ్యామని చెప్పుకొచ్చారు. 
 
''వెల్‌కమ్ బ్యాక్ సార్. మీకు, చిత్ర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్''అని చిరు సినిమాని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. బాలయ్య 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై స్పందించిన మహేశ్ ''హేట్సాఫ్ బాలకృష్ణ గారు. గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను అద్భుతంగా చూపించిన చిత్ర యూనిట్ అభినందనలు.. అంటూ ట్వీట్ చేశారు. ఇంకా తెలుగు సినీ పరిశ్రమకు ఇలాంటి సినిమా అవసరమని... మీకు, సినిమా యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments