Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హ‌ర్షి టీజ‌ర్ ఎలా ఉంటుందో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (15:27 IST)
సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం మహర్షి. పూజా హెగ్డే కథానాయికగా..అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తోన్న‌ ఈ సినిమాను మే 9వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల‌ 6వ తేదీ ఉదయం 9 గంటల 9 నిమిషాలకి టీజర్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.
 
ఈ విషయాన్ని తెలియజేస్తూ... ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే.. ఈ టీజ‌ర్లో స్ట్రాంగ్ కంటెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ముఖ్యంగా అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఓ మాంచి డైలాగ్‌తో టీజ‌ర్ క‌ట్ చేసార‌ట‌. టీజ‌ర్ త‌ర్వాత మ‌రింత క్రేజ్ పెరుగుతుంద‌ని టీమ్ చెబుతున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. టీజ‌ర్ కూడా స‌క్స‌స్ అయితే.. మ‌హ‌ర్షికి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం. 
 
రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తోన్న ఈ భారీ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది మ‌హేష్ 25వ సినిమా కావ‌డంతో అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి.. మ‌హ‌ర్షి ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments