"మహర్షి" ఫ్యాన్స్‌కు చేదువార్త... హడావిడిగా పాటల చిత్రీకరణ

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (15:47 IST)
"మహర్షి" కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చేదు వార్త మిగిలేలా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి రాకకు ఎన్నో రోజుల సమయం లేదు. మొన్నటి దాకా మే 9 చాలా దూరంలో ఉందని అనుకున్నారు. అయితే ఇప్పుడు సమయం సమీపించింది. ఇంకా మిగిలిన టాకీ పార్ట్ కోసం అబుదాబిలో చిన్న షెడ్యూల్ పెండింగ్ ఉంది. దానికంటే ముందు ఇండోర్ సెట్స్‌లో తీయాల్సిన రెండు పాటలు మిగిలి ఉన్నాయి. అనుకున్న సమయానికి ఇవన్నీ పూర్తి చేయలేమనుకుని ఒక పాటను మాత్రం ఇష్టం లేకున్నా హడావుడిగా తీసేయబోతున్నారు. 
 
అవసరమైతే సినిమాని విడుదల చేశాక ఆ సాంగ్‌ని జోడించే ఆలోచనలో చిత్రం యూనిట్ ఉంది. 'మహర్షి'ని ఇంత ఆలస్యంగా పూర్తి చేస్తున్నా ఒక పాటను తీసివేయడం అనేది అభిమానులకు మింగుడు పడని విషయం. ఇది దర్శకుడు వంశీ పైడిపల్లి ప్లానింగ్ లోపమా లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనేది అర్థంకావడం లేదు. టీజర్ మిలియన్‌ల కొద్దీ వీక్షణలు అందుకుంటున్నా రెస్పాన్స్ మాత్రం కొద్దిగా డివైడ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటి ట్రెండ్ ప్రకారం పాటలు, సీన్‌లు కలిపితే సినిమాలకు వెళ్లి మళ్లీ చూసే పరిస్థితి లేదు. ఆ మధ్య "ఎఫ్2కు కొన్ని సన్నివేశాలు కలిపితే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సినిమాని చాలా మంది అప్పటికే చూసి ఉండటంతో కేవలం సీన్ల కోసం ఎవరూ వెళ్లలేదు. మహేష్ రేంజ్ వేరు అయినప్పటికీ అభిమానులు మాత్రమే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తారు. సినిమా హిట్ అయితేనే ఈ కలపడాలు అందగిస్తాయి. 'మహర్షి' సినిమా విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

Kavitha: ఆంధ్ర రాజకీయ నాయకులు మాటలు నచ్చవు.. అదేంటి అలా తిట్టుకోవడం?

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments