మహర్షి సినిమాకి మహేష్ యాడ్స్‌తో చిక్కులు..అందుకే ఆలస్యం

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (10:38 IST)
సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షిపై భారీ అంచనాలతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, పూజ హెగ్డె హీరోయిన్‌గా, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను అశ్విని దత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ పదేపదే వాయిదా పడుతోంది. 
 
మొదట ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ప్రకటించగా, అది కాస్తా ఏప్రిల్ 25కి వాయిదాపడింది. ఇంకా కూడా మహర్షి షూటింగ్ పూర్తి కాలేదు. పాటలతో సహా సినిమాలో కొంత భాగాన్ని ఇంకా చిత్రీకరించాల్సి ఉంది.

రెండేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వంశీ పైడిపల్లి షూటింగ్‌ని పక్కాగా ప్లాన్ చేసినప్పటికీ ఆలస్యమవుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా విడుదల తేదీని మే 9కి వాయిదా వేసారు. ఈసారి అయినా మహర్షి చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో చెప్పిన తేదీన విడుదల చేయడానికి శ్రమిస్తోంది.
 
ఇంతలా ఆలస్యమవడానికి కారణం మహేష్ బాబే అని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు తరచుగా వాణిజ్య ప్రకటనల కోసం బ్రేక్ తీసుకోవడం వల్ల చిత్రీకరణ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. మహేష్ బాబు బాలీవుడ్ స్టార్స్‌తో ధీటుగా కార్పొరేట్ సంస్థలకు వాణిజ్య ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
మహేష్ క్రేజ్ గురించి తెలిసిన కార్పొరేట్ సంస్థలు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ మహేష్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంటున్నాయి. మరి ఈసారి అయిన చెప్పిన తేదీన విడుదల చేయాలంటే మహేష్ చేతుల్లోనే ఉందటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments