Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబుకు దిష్టి త‌గిలింది - శుభం కార్డ్ ప‌డిన ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (10:23 IST)
NTR- Mahesh babu
ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్‌లో వ‌స్తోన్న `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` ఫ్రోగ్రామ్ గురించి అంద‌రికీ తెలిసిందే. నిన్న ఆదివారంనాడు మ‌హేష్‌బాబు వ‌చ్చి స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. హోస్ట్‌గా వున్న ఎన్‌.టి.ఆర్‌. అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మ‌హేష్‌బాబు స‌మాధానాలు చెప్పాడు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో మ‌హేష్‌బాబు ఓపిక‌కు కూడా ఎన్‌.టి.ఆర్‌. ప‌రీక్ష పెట్టాడు. ఫైన‌ల్‌గా మ‌హేష్‌బాబు 25 ల‌క్ష‌లు గెలుచుకుని అనాధ‌పిల్ల‌ల సంర‌క్ష‌ణ నిమిత్తం ఓ స్వ‌చ్చంధ సంస్థ‌కు చెక్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కూడా.

 
అయితే ఈ షోలో ఎన్‌.టి.ఆర్‌. అడిగిన ప్ర‌శ్న‌కు మ‌హేష్‌బాబు మీ అంద‌రివ‌ల్లే దిష్టి త‌గిలింద‌ని జ‌వాబు ఇచ్చాడు. అలా మూడుస్లారు ఆ మాట‌ను ప్ర‌యోగించాడు. స‌హ‌జంగా మ‌హేష్ బాబూ కుటుంబంతో టూర్‌లు వేస్తుంటారు. విదేశాల్లో ఎక్కువ‌గా గ‌డుపుతుంటారు. ఏడాదికి 3 నుంచి 6 సార్లు ఇలా వెళుతున్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పాడు.


టూర్ వెళ్ళాక హైద‌రాబాద్‌కు కేవ‌లం షూటింగ్ వుంటే ఇలా అలా వెళ్ళిపోతాడ‌ట‌. ఇది ఎన్‌.టి.,ఆర్‌. ప్ర‌స్తావించ‌గానే.. వెంట‌నే మ‌హేష్‌బాబు.. మీరంద‌రూ అలా అనుకోబ‌ట్టే నాకు దిష్టి త‌గిలింది. రెండేళ్ళ‌పాటు ఇంటిలోనే కూర్చున్నానంటూ తెలిపాడు. క‌రోనావ‌ల్ల త‌ప్ప‌ని స్థితిలో అంద‌రూ ఇంటిలోనే వున్నారుగ‌దా. 

 
ఫైన‌ల్‌గా ట్విస్ట్ ఏమంటే, మ‌హేష్‌బాబు ఎపిసోడ్‌తోనే `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` ప్రోగ్రామ్‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. ఎన్‌.టి.ఆర్‌. మాట్లాడుతూ, ఈ సీజ‌న్ పూర్త‌యింది. దీనివ‌ల్ల ఎంతోమందిని క‌లుసుకుని వారితో చాలా విష‌యాలు షేర్ చేసుకున్నాన‌ని పేర్కొన్నారు. సో... ఎప్ప‌టినుంచో శుభం కార్డ్ ప‌డుతుంద‌ని జ‌నాల‌కు తెలిసినా ఇలా మ‌హేష్ బాబు ఎపిసోడ్ ప‌డింద‌న్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments