Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరం ప్రాజెక్టు నిధుల‌ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి

పోలవరం ప్రాజెక్టు నిధుల‌ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి
విజ‌య‌వాడ‌ , శనివారం, 4 డిశెంబరు 2021 (14:09 IST)
గోదావరి ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోంద‌ని, కేంద్రం నుండి నిధులు రప్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందార‌ని సిపిఐ  సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమ‌ర్శించారు. రాజ‌మండ్రిలోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఉదయం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సవతి తల్లి ప్రేమ చూపిస్తుంద‌న్నారు. 
 
 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ 54 వేల కోట్లు రాష్ట్రాన్ని సాధించేందుకు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఒప్పించేందుకు అఖిలపక్షాన్ని తీసుకు వెళ్లాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకువెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే, ప్రతిపక్ష పార్టీలను తాము తమ నేతృత్వంలో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.
 
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతింద‌ని, ప్రభుత్వ గృహాల లబ్ధిదారుల నుండి గ్రామాలలో 5000 పట్టణాల్లో 10,000, 15,000 వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. ప్రభుత్వం గతంలో నిర్మించిన ప్రభుత్వ గృహాల లబ్ధిదారుల నుండి రెగ్యులేషన్ పేరుతో డబ్బులు వసూలు చేయడం తమ ఖజానా నింపుకోవడానికేనని ఎద్దవా చేశారు. ఎవరైనా ఇళ్లకు డబ్బులు కడితే కానీ, పేద మధ్య తరగతి బడుగు బలహీనవర్గాల నుండి మాత్రం వసూలు చేయడాన్ని ఒప్పుకోమన్నారు .
 
చట్టపరంగా పేదలకు సంక్రమించిన గృహాలపై ప్రభుత్వ పెత్తనం ఏమిట‌ని ఆయన ప్రశ్నించారు. 
మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికీ ఉన్న గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను ప్రస్తుతం ఉన్న ధరల‌కి  పొంత‌న లేదన్నారు. అప్పుడు గ్యాస్ 450 ఉంటే, ఇపుడు వెయ్యి రూపాయలకు చేరుకుందని, పెట్రోల్ 50 ఐదు రూపాయలు ఉండగా, ఇపుడు వంద‌ రూపాయలు దాటింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ, తాము వచ్చాక పెరిగిన ధ‌ర‌ల‌ను అంచ‌నా వేసుకోవాల‌ని సూచించారు. 
 
 
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రావుల వెంక‌య్య‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.దుర్గాభవాని, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నగర కార్యదర్శి నల్ల రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ నల్ల భ్రమరాంబ‌, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేమిద్దరం ఒకేసారి సీఎంలుగా పనిచేసాము: రోశయ్య మృతిపై ప్రధాని