Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సభాపతి అందుకు పనికిరాడు, వంశీ ఆలస్యంగానైనా మేల్కొన్నాడు: నారాయణ

Advertiesment
సభాపతి అందుకు పనికిరాడు, వంశీ ఆలస్యంగానైనా మేల్కొన్నాడు: నారాయణ
, గురువారం, 2 డిశెంబరు 2021 (21:28 IST)
ఎపి శాసన సభాపతిగా తమ్మినేని సీతారాం పనికిరాడంటూ విమర్సించారు సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ. విలువలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సభాపతి మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తిని తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు చూడనేలేదంటూ మండిపడ్డారు సిపిఐ నారాయణ.

 
తిరుపతిలో మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఆలస్యంగానైనా వల్లభనేని వంశీ భువనేశ్వరికి క్షమాపణ చెప్పడం శుభపరిణామమన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను విమర్సించవద్దన్నారు. దేశంలో 750మంది రైతులు ఆత్మహత్యలన్నీ.. కేంద్రప్రభుత్వ హత్యలేనన్నారు సిపిఐ నారాయణ.

 
సస్పెండ్ చేసిన 13 మంది ఎంపిలను తిరిగి పార్లమెంటులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో వైసిపి ఎంపిలు కేంద్రాన్ని గట్టిగా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బిజెపితో వైసిపి లాలూచీ రాజకీయాలు చేస్తోందన్నారు.

 
పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు వైసిపి ఎంపిలు భయపడిపోతున్నారని విమర్సించారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని విమర్సించడం.. ఢిల్లీ వెళ్ళిందే మౌనంగా కూర్చుండిపోవడం వైసిపి నాయకులు తెలిసిన జిమ్మిక్కులంటూ మండిపడ్డారు. అమరావతి రైతులను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని నారాయణ ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైలం ఘాట్‌ రోడ్డు.. బస్సు కిటికీ నుంచి తలను బయటకు పెట్టింది.. అంతే?