Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైడర్‌లో మహేష్ బాబు లుక్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే పండగ..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్ లుక్ వచ్చేసింది. తద్వారా స్పైడర్‌లో మహేష్ లుక్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బ్రహ్మోత్సవం ఫట్ అయ్యాక.. మంచ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (17:43 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్ లుక్ వచ్చేసింది. తద్వారా స్పైడర్‌లో మహేష్ లుక్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బ్రహ్మోత్సవం ఫట్ అయ్యాక.. మంచి హిట్ కోసం ఆచితూచి అడుగులేస్తున్న ప్రిన్స్.. మురుగదాస్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 
 
చాలాకాలం పాటు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్‌ మధ్య ఉత్కంఠ రేపారు. అయితే బుధవారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా స్పైడర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం మురుగదాస్ ఎన్నో కసరత్తులు చేశాడు. అతని శ్రమకు తగినంత ఫలితం లభించింది. మహేష్ బాబు ఫస్ట్ లుక్ అవుట్ పుట్ అదిరిపోయింది. 
 
మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు స్పైడర్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా, పవన్ కల్యాణ్ ఖుషీ సినిమా దర్శకుడు ఎస్.జె. సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబుతో జోడీగా నటిస్తోంది. భారీ బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments