Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నుంచి మ‌హేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రం షూటింగ్

Webdunia
శనివారం, 9 జులై 2022 (11:56 IST)
Mahesh Babu (twitter photo)
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో,టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న భారీ,ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతోంది.
 
ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతున్నారు. 
 
మ‌హేష్‌బాబు , త్రివిక్ర‌మ్ హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్  షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ  సందర్భంగా ప్రచార చిత్రంను విడుదల చేసారు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ చిత్రం యూనిట్. 
ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే... జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం అవగత మవుతుంది. 
 
మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు`, `ఖ‌లేజా` దశాబ్ద కాలానికి పైగా నేటికీ  ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. దశాబ్ద కాలానికి పైగా  ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది అన్న వార్త    అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది.
 
ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది (2023) వేసవి లో చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ  ఈ సందర్భంగా తెలిపారు.  టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్పెష‌ల్ క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు),  ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని నరేంద్ర మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

రౌడీ షీటర్ బోరుగడ్డకు ఠాణాలో వీఐపీ ట్రీట్మెంట్ - భయ్యా టీ అంటూ ఆర్డర్ వేయగానే...

మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రచారం.. వైరల్ అవుతున్న వీడియో (video)

చడీచప్పుడుకాకుండా గనుల రెడ్డికి బెయిల్ ఇచ్చేశారు.. అభ్యంతరం చెప్పని ఏసీబీ

ఏపీకి పొంచివున్న మరో తుఫాను.. 23న అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments