Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెహ్రీన్ హవా మాములుగా లేదు... (వీడియో)

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కుర్రకారు హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయింది.

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (16:22 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కుర్రకారు హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ అయింది.
 
ఇటీవల 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో మంచి విజయాన్ని రుచిచూసింది. ఇపుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన "జవాన్" చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందన్న ధీమాలో ఉన్నారు. 
 
ఇపుడు ఇదే కోవలో మాస్ హీరో గోపిచంద్ సరసన నటించే ఛాన్స్ మెహ్రీన్‌ కొట్టేసింది. కొత్త దర్శకుడు చక్రి డైరెక్షన్‌లో గోపిచంద్ ఓ మూవీ చేయనుండగా ఇందులో మెహ్రీన్‌ని కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నారట. మరి దీనిపై పూర్తి క్లారిటీ త్వరలోనే రానుంది. 
 
మెహ్రీన్ తన హవా ఇలానే కొనసాగిస్తే రానున్న రోజులలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా మారడం ఖాయమని అంటున్నారు. అందుకే టాలీవుడ్ సెలెబ్రిటీలు.. మెహ్రీన్ హవా మామూలుగా లేదని అంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments