Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29న టిడిపిలోకి వాణీ విశ్వనాథ్... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చినబాబు

తెలుగుదేశం పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిడిపి అధికారంలో ఉండటంతో పాటు సీనియర్లు, జూనియర్లనే వ్యత్యాసం లేకుండా అందరూ కలిసి ఉండటం, పార్టీలో అందరికీ సముచిత స్థానం ఇస్తుండటం ఇదంతా కొంతమందిని బాగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సినీప్రముఖులు అ

Advertiesment
29న టిడిపిలోకి వాణీ విశ్వనాథ్... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చినబాబు
, గురువారం, 9 నవంబరు 2017 (10:28 IST)
తెలుగుదేశం పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిడిపి అధికారంలో ఉండటంతో పాటు సీనియర్లు, జూనియర్లనే వ్యత్యాసం లేకుండా అందరూ కలిసి ఉండటం, పార్టీలో అందరికీ సముచిత స్థానం ఇస్తుండటం ఇదంతా కొంతమందిని బాగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సినీప్రముఖులు అధికార పార్టీలోకి క్యూకడుతున్నారు. గత కొన్నిరోజులుగా సినీనటి వాణీ విశ్వనాథ్  తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. 
 
తను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని గతంలోనే ఆమె ప్రకటన కూడా చేసింది. అయితే పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాతనే చంద్రబాబును కలుస్తానని, ఆ తరువాత టిడిపి తీర్థం పుచ్చుకుంటానని చెప్పారామె. తాజాగా రెండురోజుల క్రితం కూడా ఆమె ఇదే ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనలో తాను త్వరలోనే చేరబోతున్నట్లు చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. 
 
ఇప్పటికే వాణీ విశ్వనాథ్ పార్టీలో చేరే తేదీ దాదాపు ఖరారైంది. అది కూడా ఈ నెల 29న తేదీన టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. ఆమె చేరికకు చినబాబు నారా లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో వాణీ విశ్వనాథ్ ఆ తేదీలో చేరడం దాదాపు ఖాయమైంది. వాణీ విశ్వనాథ్ టిడిపిలో చేరితే మిగిలిన నేతలు ఆమెను ఎలా ఆహ్వానిస్తారు, ఎక్కడి నుంచి ఆమె పోటీ చేసే అవకాశముందన్నదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేవెళ్ల నుంచి రేవంత్ పాదయాత్ర.. రాములమ్మ కూడా..?