Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీబ్యూటీకి సైబర్ సెల్ సమన్లు.. ఎందుకబ్బా?

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (12:33 IST)
చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ సెల్ విభాగం సమన్లు జారీ చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌‍ కేసులో ఈ నెల 29వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆమెకు కబురు పంపించారు. మహాదేవ్ అనుబంధ సంస్థ ఫెయిల్ ప్లే యాప్‌ను గతంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ఆ యాప్‌ను ప్రమోట్ చేశారు. 
 
అయితే, గత యేడాది ఐపీఎల్ మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్ చట్ట విరుద్ధంగా స్ట్రీమింగ్ చేసిందంటూ, దీనివల్ల తమకు కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన వయాకామ్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. 
 
కాగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‍‌కు కూడా ఇదే కేసులో ఈ నెల 23వ తేదీన హాజరుకావాలని సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. అయితే, తాను విదేశాల్లో ఉన్నందున ఆ రోజున విచారణకు హాజరుకాలేనని, తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మరో తేదీ, సమయం పంపాలని సంజయ్ దత్ సైబర్ సెల్‌ను కోరిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments