Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట నుంచి మహా శివరాత్రి పోస్టర్ వ‌చ్చేసింది

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (12:23 IST)
Sarkaruvari poster
సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ అంచనాలున్న చిత్రం `సర్కారు వారి పాట` నిర్మాణం చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ప్రధాన తారాగణం షూటింగ్‌లో పాల్గొంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
 
మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను నేడు ఆవిష్కరించారు. సినిమాలో రౌడీ గ్యాంగ్‌తో మహేష్ బాబు పోరాడే స‌న్నివేశంలో కనిపిస్తాడు. సినిమాలో మంచి యాక్షన్‌ డోస్‌ ఉంటుందని, పోస్టర్‌ కూడా అదే సూచిస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 
సెన్సేషనల్ కంపోజర్ S థమన్ సంగీతం అందించారు  ఇప్ప‌టికే మొదటి సింగిల్ `కళావతికి` 50 మిలియన్లకు పైగా వీక్షణలతో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది.
 
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు.
 
సర్కారు వారి పాట మే 12న స‌మ్మ‌ర్ కానుక‌గా రాబోతోంది.
 
తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది:
 
రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల, 
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీత దర్శకుడు: థమన్ ఎస్ఎస్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో-డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
CEO: చెర్రీ
VFX సూపర్‌వైజర్ - యుగంధర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments