సూపర్ స్టార్ మహేష్ బాబు కళావతి సాంగ్ ట్రెండింగ్‌లో వున్న సంగతి తెలిసిందే. ట్రెండింగ్‌గా మారిన ఈ సాంగ్‌పై సెలెబ్రిటీలు సైతం చిందేస్తున్నారు.
ఇప్పటికే కీర్తి సురేష్, సితార ఇద్దరూ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కాగా, తాజాగా తమన్ అదిరిపోయే స్టెప్పులతో పవర్ స్టార్ అభిమానులను ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి "కళావతి" సాంగ్‌కు స్టెప్పులేసి తమన్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇక ఈ పాటను సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. సినిమాలో కళావతి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన కళావతి యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ, సరికొత్త దిశగా దూసుకెళ్తోంది. "సర్కారు వారి పాట" స్వరకర్త ఎస్ఎస్ తమన్ పై ఈ సాంగ్ ట్యూన్ అదిరిపోయింది అంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది.